* బీజేపీ – కాంగ్రెస్ పోటా పోటీ
* చెరో ఎనిమిది స్థానాల్లో ముందంజ
* సీటు దక్కించుకుంటున్న ఎంఐఎం
* ఒక్క సీటులో ప్రభావం చూపని బీఆర్ ఎస్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ( Parliament election Results ) బీజేపీ – కాంగ్రెస్ పార్టీలు నువ్వా- నేనా అన్నట్లు దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న మొతం 17 లోక్ సభ సీట్లకు గాను చెరో ఎనిమిది స్థానాల్లో రెండు పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఎంఐఎం యథావిదిగా తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉంది. ఇక బీఆర్ ఎస్ పార్టీ మాత్రం ఎక్కడా కూడా తన ప్రభావాన్ని చూపెట్ట లేకపోయింది.
బీజేపీ లీడ్లో ఉన్న సీట్లు ఇవే..
బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉన్న స్థానాలు మల్కాజిగిరి – ఈటల రాజేందర్, సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి, చేవెళ్ళ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి , కరీంనగర్ – బండి సంజయ్ , నిజామాబాద్ – అరివింద్ , ఆదిలా బాద్ – నగేశ్ , మహబూబ్ నగర్ – డీకే అరుణ , మెదక్ – రఘునందన్ రావులు ముందంజలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఈ సీట్లు
కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎనిమిది సీట్లల్లో ముందంజలో ఉంది. వరంగల్ – కడియం కావ్య , మహబూబాబాద్ – బలరాం నాయక్, ఖమ్మం – రామసహాయం రఘురాం రెడ్డి , పెద్దపల్లి – గడ్డం వంశీకృష్ణ , భువనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి , నల్గొండ – రఘువీర్ రెడ్డి, నాగర్ కర్నూల్ – డాక్టర్ మల్లు రవి, జహీరాబాద్ – సురేష్ షెట్కార్లు ముందంజలో ఉన్నారు.
విజయం దిశగా అసదుద్దీన్
ఎంఐఎం పార్టీ తన ఏకైక సీటును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి మాదవీలత అసదుద్దీన్ కు ప్రచారంలో గట్టి పోటీ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు తర్వాత ఆ ప్రభావం మాత్రం కనబడలేదు, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ విజయం దిశగా దూసుకుపోతున్నారు.
బీఆర్ ఎస్ పార్టీ ప్రభావం నిల్
బీఆర్ ఎస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 17 పార్లమెంట్ సీట్లల్లో ఎక్కడా కూడా ప్రభావాన్ని చూపలేక పోయింది. మెదక్ సీటు పై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం కానరాలేదు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ నుంచి లీడ్లో ఉన్నారు.
——————————–