*ఆశ వర్కర్ల అక్రమ అరెస్టులు సరికాదు
* సిపిఎం మండల కార్యదర్శి
సమస్యల పరిష్కారం కోసం వెళ్ళిన ఆశా వర్కర్ల అరెస్ట్ సరికాదని సిపిఎం చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ ఉన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ
ఉద్యోగ భద్రత కోసం పార్ట్ టైం ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రైతులు ఈ పాలకులను ప్రశ్నించే హక్కు ఉందన్నారు. గ్రామాలలో పేదవారికి వైద్యం అందిస్తున్న ఆశా వర్కర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో 18000/వేల కనీస వేతనం ఇస్తానని ప్రభుత్వ మాట తప్పిందన్నారు. తన పరిష్కారం కోసం ఆశా వర్కర్లు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వగా వారిని అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి 18 వేల కనీస వేతనం అమలు చేయాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
