*దీన్ దయాళ్ మహాభియాన్ సన్నాహక సమావేశంలో
*పాల్గొన్న బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మండల ప్రశిక్షణ మహాభియాన్-2026 సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం బిజెపి మండల అధ్యక్షులు సట్ల వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. బిజెపి
జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్, మాజీ మంత్రి గుండె విజయరామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్, రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్, పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగెందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జులు వివిధ మోర్చాల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
