Kadiyam Kavya Birthday Celebrations
ఆకేరు న్యూస్ స్టేషన్ ఘన్ పూర్:
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య 43వ జన్మదిన వేడుకలు స్టేషన్ ఘన్ పూర్ కేంద్రంలోని నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నీల రాజమ్మ గట్టయ్య, కౌన్సిలర్లు గట్టు సంగీత రమేష్, అంగడి రజిత కృష్ణ, పెసరు కృష్ణవేణి సారయ్య నాయకులు బూర్ల శంకర్, వక్కల రాజు, జీడి రమేష్, కిషన్ రాజు, గట్టు శివ, సింగపురం దయాకర్, సింగపురం వెంకటయ్య, ఫాతి కుమార్, చింత ఎల్లయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.
* ఎంపీకి దేవస్థానం చైర్మన్ శుభాకాంక్షలు
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య 43వ జన్మదినం సందర్భంగా చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ నివాసంలో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీది సురేష్ కుమార్, సర్పంచులు ఎలగందుల నరసింహారెడ్డి, మల్లారెడ్డి, దేవస్థానం డైరెక్టర్లు రత్నాకర్ రెడ్డి, రమేష్, మోటం శ్రీనివాస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
