Corn Procurement Farmers Issue
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
స్థానిక వ్యవసాయ మార్కెట్లో మధ్య దళారులను అనుమతించవద్దని, ఇప్పగూడెంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య రెడ్డికి శుక్రవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మునిగల రమేష్ మాట్లాడుతూ మొక్కల కొనుగోలు ఎదురవుతున్న సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోవడం తో కొనుగోలులో వేగం పెరిగిన ఫంగస్ పేరుతో చాలా వరకు రిజెక్టు చేస్తున్నారని దానివల్ల మధ్య దళారులు రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. అనుమతి లేనివారు మార్కెట్ లోకి వచ్చి తక్కువ రేటుకు కొనడం జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, చైర్మన్ మొక్కజొన్నల మార్క్ఫెడ్ ఇన్చార్జి తో కలిసి ప్రతి ఒక్క రైతు పంటను పరిశీలించి కొనుగోలు జరిగే విధంగా చూడాలని కోరారు. మండలంలో ఇప్పగూడెంలో గరిష్టంగా మొక్కజొన్న పంటను రైతులు వేశారని అక్కడినుంచి తేవడం రైతులకు భారంగా మారుతుందని అందుకోసం ఇప్పగూడంలోనే మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తోడంగల ఐలయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి లింగనబోయిన కుమార్, నాయకులు దాసరి కొమురయ్య, మునిగెల సోమేశ్వర్, అన్నెపు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
