Model school entrance exam 2026
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఈ నెల 19 వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ తెలంగాణ మోడల్ స్కూల్, స్టేషన్ ఘనపూర్ లో 6 నుండి 10వ తరగతి (2026-27) ప్రవేశ పరీక్ష 19 ఏప్రిల్ 2026 (ఆదివారం) రోజున స్థానిక మోడల్ స్కూల్లో నిర్వహిస్తామని తెలిపారు.
6వ తరగతి: ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు: మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 4.00 వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు.
పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని, ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను telanganams.cgg.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు.
పరీక్షలో 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి వీటికి సమాధానాలను OMR షీట్లపై గుర్తించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ వేణు గోపాల రెడ్డి తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
