Mulugu SSC results top district
* పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానం.
ఆకేరు న్యూస్, ములుగు:
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది.
ములుగు జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో 1697 మంది బాలురు, 1590 మంది బాలికలు పరీక్షలకు కాగా 1681 బాలురు, 1583 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఏది ఏమైనా పనికి పదవ తరగతి పరీక్ష ఫలితాలలో బాలురు 99.06%, బాలికలు 99.56% ఉత్తీర్ణత సాధించారు.దీంతో బాలికలు ముందంజలో ఉత్తీర్ణులయ్యారు. ములుగు జిల్లా 99.30 శాతం నమోదు అయ్యి.రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచింది. దీంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు అభినందన లు తెలుపుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
