Farmers Procurement Center Issues
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం, అక్కపెళ్లి గూడెం దాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘంఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి లింగబోయిన కుమారస్వామి మాట్లాడారు గత వారం రోజుల 15 రోజులుగా లారీలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ధాన్యం, మొక్కజొన్న తక్షణమే కొనుగోలు చేయాలి, గన్ని సంచుల కొరత అరికట్టాలి, పి.ఎ.సి.ఎస్. సహకార సంఘాలకు కొత్త గన్ని బ్యాగులు ఇవ్వాలి. తాలు, తరుగు మట్టి పేరుతో మిల్లర్ల కట్టింగును అరికట్టాని కోరారు. మిల్లర్ల వర్కింగ్ చార్జీలు 18 కోట్ల రూపాయలు విడుదల చేసి, రైతుల ధాన్యం దిగుమతి చేసుకొని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ శాఖ ఏఈవోలు సి గ్రేడ్ ధాన్యం పరిశీలించి టోకెన్ ఇవ్వాలని కోరారు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఇప్పగూడెం గ్రామ కార్యదర్శి మంద చంద్రమౌళి నాయకులు కసాని రమేష్, పిట్టల గట్టయ్య, రాములు, విజేందర్, కుంట రాజు, యార మోహన్, నీరటి సంపత్, మంద రాజు, మునిగెల నరింహులు,రైతులు తోడేంగలా మల్లయ్య, కాసు రాజు, మంద మల్లయ్య, శివ, అనిల్, యాకయ్య,తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
