VH BC Welfare Advisor
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (బీసీ సంక్షేమ మరియు అభివృద్ధి శాఖ) నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు (G.O.Rt.No.560) జారీ చేసింది.
* మంత్రి హోదాలో నియామకం:
ఈ నియామకంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, వీహెచ్‌కు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్థాయి (Minister of State Rank) హోదాను కల్పించారు. వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ ప్రకారం ఆర్టికల్ 18 కింద ఆయనకు గౌరవ మర్యాదలు అందనున్నాయి. ఈ పదవిలో ఆయన ఉన్నంత కాలం మంత్రికి సమానమైన ప్రోటోకాల్ మరియు సౌకర్యాలు లభిస్తాయి.
* వేతనం& ఇతర సౌకర్యాలు:
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వీహెచ్‌కు అందే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..
వేతనం: నెలకు రూ. 1,00,000/- (వేతనం మరియు ప్రత్యేక అలవెన్సులు కలిపి).
నివాసం: ప్రభుత్వ క్వార్టర్స్ లేదా నెలకు రూ. 50,000/- ఇంటి అద్దె భత్యం.
వాహనం: సొంత కారు ఉపయోగిస్తే రూ. 30,000/- కాన్వాయ్ అలవెన్స్ మరియు నెలకు రూ. 15,000/- పెట్రోల్ ఖర్చులు.
సిబ్బంది: ఒక ప్రైవేట్ సెక్రటరీ, ఒక డీఈఓ (DEO), ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు మరియు ఒక డ్రైవర్‌ను ప్రభుత్వం కేటాయించింది.
వైద్యం: ఐఏఎస్ అధికారులకు సమానంగా మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం ఉంటుంది.
బీసీ సంక్షేమ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వీహెచ్ నియామకం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీసీల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో ఆయన అనుభవం సర్కార్‌కు దిశానిర్దేశం చేయనుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
