Kadiyam Srihari Political Criticism
* అప్పుడు ఏం వెలగబెట్టిన్లని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టిన్లని ఇప్పుడు ప్రభుత్వాన్ని, మా ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శిస్తున్నారు ? పార్టీ నుంచి బహిష్కరించబడిన నీకు మా ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించే అర్హత ఏమిటని కాంగ్రెస్ పార్టీ చిల్పూర్ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ కుమార్, జిల్లా నాయకుడు మోటం శ్రీనివాసులు ప్రశ్నించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, మల్కాపూర్ సర్పంచ్ ఎడవల్లి లావణ్య మల్లారెడ్డి లతో కలిసి వారు మాట్లాడారు. రెండు రోజుల క్రిందట రాజవరం కొనుగోలు కేంద్రాన్ని ఎడవల్లి రాకేష్ రెడ్డి, ఫతేపూర్ కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దేవాదుల సృష్టికర్త కడియం శ్రీహరి దూర దృష్టితో నియోజకవర్గంలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారన్నారు. శాసనసభ సమావేశాల్లో మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత శాఖ అధికారులతో చర్చించి మార్క్ఫెడ్ ద్వారా మొక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే అన్నారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయించి ఐకెపి ద్వారా ఆ కేంద్రాలను మహిళలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. మహిళలని లక్షాధికారులు చేయాలన్న సంకల్పంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించిన ఘనత మా ప్రభుత్వానికి దక్కింది అన్నారు. ఉద్యమం పేరుతో సకల జనుల త్యాగాల పునాదులపై అధికారం చేపట్టిన టిఆర్ఎస్ నాయకులు, నేతలు ఆర్థికంగా బలపడ్డారే తప్ప సామాన్యుడికి న్యాయం చేకూర్చలేదని ధ్వజమెత్తారు. ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎడవెల్లి రాకేష్ రెడ్డి, జనగామ యాదగిరి వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించడం సరికాదన్నారు. రాజవరం గ్రామంలో భూ కబ్జాలు, దళితుల భూములు లాక్కున్న రాకేష్ రెడ్డి మచ్చలేని మా నాయకున్ని విమర్శించే స్థాయా నీది అని ప్రశ్నించారు. అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ? నిన్ను బహిష్కరించిన నాయకుడు నియోజకవర్గానికి ఇన్చార్జ్ ? లేదా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అందజేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే గ్రామస్తులు ఎవరు ఊరుకోరు అని హెచ్చరించారు. పల్లవి ఆసుపత్రులు అన్ని రోగాలకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పుకుంటున్న మీ నాయకుడు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, మీరు పేదల రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పదేళ్లు మీరేం చేశారు ప్రజలు గుర్తించి తగిన గుణపాఠం చెప్పిన మీకు బుద్ధి రాలేదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తురిగి సలహాలు, సూచనలు ఇవ్వాలి తప్ప విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, టెంపుల్ డైరెక్టర్లు బత్తుల సూర్యనారాయణ, యాకయ్య, ఉపాధ్యక్షులు కన్నెబోయిన రవి, జక్కుల రాజయ్య, బత్తుల దేవదాసు, రావుల రమణారెడ్డి, మచ్చ రమేష్, జక్కుల వెంకన్న, కర్నాల, శ్రీనివాస్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
