Kamareddy drunk Theft Attempt Incident
ఆకేరు న్యూస్, కామారెడ్డి:
మద్యం మత్తులో దొంగతనానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులకు కామారెడ్డి ప్రజలు చుక్కలు చూపించారు. నిషాలో ఏం చేస్తున్నారో తెలియక ఓ ఇంట్లోకి చొరబడిన సదరు వ్యక్తులను స్థానికులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేశారు.
* భయాందోళనలో ఇంటి యజమాని
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మద్యం మత్తులో తూలుతూ ఓ నివాసంలోకి ప్రవేశించారు.అపరిచితులు ఇంట్లోకి రావడాన్ని గమనించిన యజమాని తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
* రోడ్డుపైనే దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత
మత్తులో ఉన్న ఆ దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, స్థానికులు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. ఆగ్రహించిన జనం వారిని రోడ్డు మీదకు లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. అనంతరం డయల్ 100కు సమాచారం అందించి, నిందితులను పోలీసులకు అప్పగించారు. నిందితుల వివరాలపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మత్తులో ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
