Namiligonda
* రూ.77 లక్షలతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం!
* 700 మీటర్ల మేర సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ల నిర్మాణం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని నమిలిగొండ గ్రామానికి అభివృద్ధి బాటలు పడుతున్నాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రారంభమైన పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
దశాబ్దాలుగా గ్రామంలోని ప్రధాన రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో సర్పంచ్ పురమాని కోమల ఐలోని ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయించి కార్యరూపంలోకి తీసుకొచ్చారు.
కూడా (KUDA) నిధుల కింద సుమారు రూ.77 లక్షల అంచనా వ్యయంతో 700 మీటర్ల మేర సీసీ రోడ్డు (CC Road) విస్తరణతో పాటు సైడ్ డ్రైన్ల (Side Drains) నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే రాకపోకలు సులభతరం కావడంతో పాటు మురుగునీటి సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యతో పాటు సర్పంచ్ పురమాని కోమల ఐలోనికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

