Kamalapur Model School Admissions
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 13 నుండి 25 వరకు tgms.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి. అనిత తెలిపారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సాధించిన మెరిట్ మార్కులు, ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆమె తెలిపారు. కళాశాలలో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఏఈసీ ఒక్కో గ్రూపులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 27న కళాశాల నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. మే 28 నుండి 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. ఎంపికైన వారికి ఉచిత విద్య, బాలికలకు హాస్టల్ వసతి, ఉచిత పాఠ్యపుస్తకాలు, నీట్,ఈఏపీసీఈటీ కోచింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
