Hanumakonda Mobile Tourism Launch by Collector Chahat Bajpai
* పర్యాటక సమాచారం ఇక ప్రజల ముంగిట
* మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
ఆకేరు న్యూస్, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త ముందడుగు వేసింది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల గురించి ప్రజలకు, పర్యాటకులకు మరింత సమాచారం చేరవేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘మొబైల్ టూరిజం’ వాహనాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ గురువారం ప్రారంభించారు.
హన్మకొండ కలెక్టరేట్ (IDOC) కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల విశిష్టతను చాటిచెప్పడంలో ఈ మొబైల్ వాహనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
* ఈ వాహనం ప్రత్యేకతలు…
పర్యాటక ప్రాంతాల బుకింగ్స్ మరియు సమాచారం సులభంగా లభిస్తుంది. ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లి పర్యాటక శాఖ ప్యాకేజీల గురించి అవగాహన కల్పిస్తుంది. పర్యాటక రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ వినూత్న ప్రయత్నం దోహదపడుతుంది.ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం మరియు ఇతర ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
ALSO READ :
Please tell us what is wrong. Your report will be sent to the website team.

2 thoughts on “COLLECTOR CHAHAT BAJPAI | కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం”