STATION GHANPUR SCHOOL COMPOUND WALL
* పాఠశాల ప్రహరి గోడ నిర్మాణ పనులు ప్రారంభించిన చైర్మన్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట శివారు మారేపల్లి గూడెం ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం పనులు చీపు చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు శుక్రవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ప్రహరి గోడ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పొట్లపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ మెరుగైన విద్య, వైద్యం, అందించడమే ప్రధాన లక్ష్యంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషి చేస్తున్నారని తెలిపారు. చిల్పూర్ మండలం అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే నూతన ప్రణాళికలతో ఉన్నారని రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దార రాజు, ఉపసర్పంచ్ రఫీ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, దేవస్థానం డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పేరాల సుధాకర్, మర్రి దుర్గాప్రసాద్, జీడి రమేష్, శ్రీనివాస్, యాదగిరి ,కార్యదర్శి సాంబరాజు, కరోబార్ ఆనందం, ఫీల్డ్ అసిస్టెంట్ యాకరాజు, ఇస్రం శ్రీనివాస్, దారా అశోక్ పాల్, వార్డ్ సభ్యులు దావీదు, కుంచాల సంపత్ రాజ్, మచ్చ హరీష్, అంజి, దిలీప్ యువజన నాయకులు కృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
