Collector Chahat bajpai Double Bedroom Housing Facilities
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, కమలాపూర్ గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల సముదాయాల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి అన్ని రకాల ప్రాథమిక మౌలిక వసతులను తక్షణమే కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లకు సంబంధించి ఏవైనా మరమ్మతు పనులు ఉంటే వాటిని వేగంగా పూర్తి చేయాలని, పెండింగ్ పనులన్నింటినీ జాప్యం లేకుండా ముగించి అర్హులైన లబ్ధిదారులకు త్వరగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గూడూరు, కమలాపూర్ సర్పంచ్లు బండి వనజ, డబ్బు సతీష్ , జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, డీఆర్డీఓ మేన శ్రీను, ఎంపీడీవో గుండె బాబు, తహసీల్దార్ సురేష్ కుమార్, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
