DEPUTY CM PAWAN KALYAN Janasena High Court Petition
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయ సందడి ఒక్కసారిగా వేడెక్కింది. హైదరాబాద్‌లో జనసేన ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన లీగల్ టీమ్ రంగంలోకి దిగింది.
సభకు అనుమతి రాకపోవడంతో జనసేన లీగల్ టీమ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ.. కొద్దిసేపట్లో హైకోర్టు రిజిస్ట్రార్‌ను జనసేన లీగల్ బృందం కలవనుంది. ఈ రోజే విచారణ జరిపేలా ‘హౌస్ మోషన్’ పిటిషన్ దాఖలు చేయాలని జనసేన నేతలు నిర్ణయించారు. సభ నిర్వహణకు అనుమతి ఇచ్చేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని ఈ పిటిషన్లో కోరనున్నట్లు సమాచారం.
* సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్…
మరోవైపు ఈ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. సభకు అనుమతి నిరాకరణ, హైకోర్టులో పిటిషన్ తదితర అంశాలపై చర్చించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ అత్యవసరంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
ఈ మీడియా సమావేశంలో తెలంగాణ పోలీసుల వైఖరిపై, పార్టీ తదుపరి కార్యాచరణపై పవన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. దీంతో జనసైనికులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఈ ప్రెస్ మీట్‌పై ఉత్కంఠ నెలకొంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
