Janasena Party Telangana Office
* పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ప్రారంభం
ఆకేరు న్యూస్,హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక అడుగు వేశారు. హైదరాబాద్‌లోని మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ కేంద్రీయ కార్యాలయాన్ని (janasena party office) ఆయన రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో జనసైనికులు హాజరయ్యారు. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు, హోమంలో పాల్గొన్నారు.
* తెలంగాణపై ప్రత్యేక ఫోకస్..
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలంగాణలో జనసేనను బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నూతన కార్యాలయం పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు, పార్టీ అంతర్గత సమీక్షలు నిర్వహించేందుకు ఈ ఆఫీస్ వేదిక కానుంది. పవన్ కళ్యాణ్ రాకతో మణికొండ పరిసర ప్రాంతాలు జనసైనికుల కోలాహలంతో, నినాదాలతో హోరెత్తాయి.
