Kamalapur Rahul Gandhi Birthday
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ కూడలి వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్ జోడో కార్యక్రమం ద్వారా 4080 కిలోమీటర్లు 145 రోజుల్లో పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ చరిత్ర సృష్టించారని కొనియాడారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం రవీందర్, యూత్ కాంగ్రెస్ నాయకుడు గాలిబు నవీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్, డాక్టర్ మౌటం కుమారస్వామి, పోడేటి బిక్షపతి, తడక శ్రీకాంత్, పుల్ల శోభన్, పల్లె సమ్మిరెడ్డి, పెరుమాండ్ల పరశురాములు, ధర్మల శ్రీకాంత్, సముద్రాల కృష్ణ, జరగాలి శివకృష్ణ, ఆకినపెల్లి బిక్షపతి, కిన్నెర కృష్ణమూర్తి, మిల్కురి శ్రీనివాస్, జన్ను బిక్షపతి, పుల్ల ఐలయ్య, భాషబోయిన రమేష్, శనిగరపు రమేష్, వంటకాల రాజిరెడ్డి, మాట్ల కళ్యాణ్, చందాబోయిన సాయి, రామకృష్ణ, గుంపుల అశోక్, తాటిపాముల రాములు, కొమురెల్లి, చిలువేరు రవి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
