Minister Seeethakka in International Yoga Day Mulugu
* యోగా దైనందిన జీవితంలో భాగం
– మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
“ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం యోగ” అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ లు యోగా ఆసనాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు… శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగ” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో వికాస్ మీనా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, డీఈఓ సిద్ధార్థ్ రెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ సంధ్య, డీఎస్పీ రవీందర్, ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు , వైద్య సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళాలు, స్వచ్ఛంద సంస్థలు, యోగా సాధకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
