National Pulse Polio Program
ఆకేరు న్యూస్, డెస్క్: ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయస్సు గల 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలు, 1.31 లక్షల మందికిపైగా సిబ్బందిని సిద్ధం చేశారు.
