Warangal Employees Suspension Orders
Published:
Updated: 24 Jun 2026 • 07:30 AM
అకేరు న్యూస్ వరంగల్: కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు డీఈవో బి.రంగయ్యనాయుడు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న వరంగల్ లోని ఇంతేజార్ంజ్ ఉర్దూ మీడియం హై స్కూల్ లో కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ జి. నిరంజన్ రెడ్డి తో పాటు రికార్డు అసిస్టెంట్ డి.శ్రీనివాస్ అనుమతి లేకుండా గైర్హాజరైన విషయాన్ని గమనించారు.
దీంతో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈవోను ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన డీఈవో సదరు ఉద్యో గులపై సస్పెన్షన్ వేటు వేశారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
