BLAs Voter List Verification
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
బిఎల్ ఏలు, రాజకీయ పార్టీల నాయకులు ఓటరు జాబితాను సరిచూసుకోవాలని తాసిల్దార్ స్వప్న కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో బుధవారం మండలంలో అన్ని గ్రామాల (BLA) భూత్ లెవెల్ ఏజెంట్ లకు స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో (S I R) పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ నమోదు, సవరణ, తొలగింపు, చేర్పులు మార్పులు మొదలైన విషయాలను సరిచూసుకోవాలని తహసిల్దార్ కోరారు. ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పుల అనంతరం తుది జాబితా వెలువడక ముందే అభ్యంతరాలు అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఓటర్లు ఓటర్ల జాబితా నుండి తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఆర్డీవో ఎస్. కిరణ్ ప్రకాష్ పర్యవేక్షణలో జరిగిన అవగాహన సదస్సులో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, మండల గిర్దవార్లు శ్రీకాంత్, సతీష్ , జూనియర్ అసిస్టెంట్ వల్లి అన్ని గ్రామాల పార్టీల యొక్క (BLA) బూత్ లెవెల్ ఏజెంట్ లు హాజరైనారు.
