Friends Donate Friend Family
* రూ.52 వేల ఆర్థిక సహాయం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
గుండెపోటుతో మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి రూ.52 వేల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు స్నేహితులు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండకి చెందిన బూరుగు సాంబరాజు పది రోజుల క్రిందట గుండెపోటుతో మృతి చెందాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో స్నేహితులంతా కలిసికట్టుగా ముందడుగు వేశారు మిత్రుడు భౌతికంగా దూరమైనా (2005-06) పదవ తరగతి స్నేహితులు మానవత్వంతో రూ.52 వేల ఆర్థిక సహాయం మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు.
భవిష్యత్ లో కూడా అండగా ఉంటామని సాంబరాజు పిల్లలకు మనోధైర్యాన్ని ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన 2005-06 టెన్త్ బ్యాచ్ విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
