Rajaiah Guides Booth Level Agents
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతి పల్లిలో శనివారం నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA)లకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య దిశానిర్దేశం చేశారు. కెసిఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ ఏజెంట్ కమిటీలను వేసుకొని ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు.
కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, డబుల్ ఎంట్రీల సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఒక ఓటు కూడా వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత BLAలదే అని గుర్తుచేశారు.
* కార్యకర్తలే పార్టీకి బలం..
బూత్ ఏజెంట్లు చిత్తశుద్ధితో పనిచేస్తే తిరుగులేదు అన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. గడపగడపకూ వెళ్లి బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ హాయంలో జరిగిన సంక్షేమాన్ని గుర్తుచేయాలని సూచించారు.
నేటి బూతు లెవెల్ ఏజెంట్స్ రేపు కాబోయే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు అంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య. ఇంటింటికీ సంక్షేమ పథకాలు, ఓటరు జాబితా పరిశీలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు, BLAలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
