TNGO Association Condoles Kathi Kumaraswamy's Demise
* కత్తికుమారస్వామి కుటుంబాన్ని పరామర్శించిన టి ఎన్ జి ఓ అసోసియేషన్
ఆకేరు న్యూస్, రాయపర్తి: మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన టి ఎన్ జి ఓ హన్మకొండ జిల్లా జాయింట్ సెక్రటరీ కత్తి రవీందర్ అన్నయ్య సామాజిక సేవా కార్యకర్త కత్తి కుమారస్వామి (Kathi Kumaraswamy) ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (CHO) అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భానోత్ నెహ్రూ చందునాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ఆయన కిష్టాపురం గ్రామానికి చేరుకుని, మృతుడిచిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మృతుని కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కిష్టాపురం గ్రామం ఒక మంచి మనసున్న సామజిక సేవకార్యకర్తను కోల్పోవడం దురదృష్టకర మని ఆవేదన వ్యక్తం చేశారు కుమారస్వామి ఎల్లప్పుడూ అందరిని కలుపుకొని గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుండి నడిపించేవారని ఆయన లోటును భర్తీచేటం ఎవ్వరితరం కాదని స్పష్టం చేశారు వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుమారస్వామి కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బి మధుసూదన్ రెడ్డి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రసిడెంట్ సంజీవకుమార్, హెల్త్ సూపర్ వైజర్ కొండపర్తి. బి జాన్సన్, ఫార్మసిస్ట్ (ఆయుష్)ఫర్ము, స్టేట్ సెక్రటరీ టిఎన్జీవో, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
