CM Revanth Reddy Today Schedule
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం పలు కీలక అధికారిక, సామాజిక కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నారు. సచివాలయం నుంచి క్షేత్రస్థాయి పరిశీలనల వరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది.
* ఉద్యోగుల సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష…
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కాంట్రాక్ట్, పొరుగు సేవల (అవుట్సోర్సింగ్) ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల డిమాండ్లు, వేతనాలు, ఇతర సర్వీసు నిబంధనలపై అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
* బాలామృతం నూతన ఉత్పత్తి కేంద్రం ప్రారంభం
సాయంత్రం 4:30 గంటలకు నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఆవరణలో ఆధునీకరించిన ‘బాలామృతం’ నూతన ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. చిన్నపిల్లలు, గర్భిణీలకు అందించే పౌష్టికాహార పంపిణీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ కేంద్రాన్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు.
* నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్…
అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్ పనులు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులు రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.
* విద్యార్థులతో కలిసి ప్రపంచకప్ ఫుట్‌బాల్ వీక్షణం…
ఇక రాత్రి వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతతో కలిసి సందడి చేయనున్నారు. రాత్రి 9:30 గంటలకు మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో విద్యార్థులతో కలిసి ఆయన ‘ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్’ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటం విశేషం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
