INTUC Felicitation Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఐఎన్టియుసీ (327) ఆధ్వర్యంలో విశ్రాంత విద్యుత్ ఫోర్మెన్ ఓగ్గుల సారయ్యకు సన్మానం చేశారు.
గతనెల ఉద్యోగ విరమణ పొందిన విద్యుత్ శాఖ టౌన్ విశ్రాంత ఫోర్మెన్ ఓగ్గుల సారయ్య దంపతులకు పట్టణ కేంద్రంలోని ఒక సమావేశ వేధికపై ఐఎన్టియుసీ 327యూనియన్ డివిజన్ కార్యవర్గం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సన్మాణ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్పిడిసీఎల్ జిల్లా ఎస్ఈ చెరుకు సంపత్ రెడ్డి హాజరై మాట్లాడారు.
ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి విరమణ అనేది సహజమని తాను చేసిన అత్యుత్తమ సేవలే శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయన్నారు.
విద్యుత్ ఉద్యోగుల ఐఎన్టియుసీ 327యూనియన్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రసిడెంట్ నీలం ఐలేష్ ఆద్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ గణాంక అధికారి శంకర్, ఘనపూర్ డిఈ బి.సారయ్య, జనగాం డిఈ లక్ష్మీనారాయణ రెడ్డి, ఏడిఈ వేణుగోపాల్, ఘనపూర్ ఏడిఈ పాల్వాయి రణధీర్ రెడ్డి, ఏఓ రవీందర్, సుదర్శన్, యాఖుబ్ పాషా, ఐలయ్య ఏఈలు శంకర్, అశోక్, ఎస్సీ,ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘ్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క సురేష్, సంకే రవీందర్, 327యూనియన్ కంపెనీ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ రెడ్డి, జిల్లా సీనియర్ వర్కింగ్ ప్రసిడెంట్ బి.వీరాంజనేయులు, వర్కింగ్ ప్రసిడెంట్ మూల మహేందర్, ఘనపూర్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఓ.యాదగిరి,బి.రాజ్ కుమార్, సీనియర్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎండి.ఫయాజ్, వర్కింగ్ ప్రసిడెంట్ శ్రీధర్, సాంబరాజు, కోశాధికారి సుధాకర్ మరియు సీనియర్ నాయకులు స్వామిదాస్, ఎడ్ల యాదయ్య, తిరుపతి, సుకేష్, ప్రభాకర్, కృష్ణంరాజు, చంద్రశేఖర్, వీరాస్వామి, దేవరాజు, రామాచారి, కాలురామ్, కుమారస్వామి, సురేందర్ రెడ్డి, అన్వర్ పాషా, రంజిత్, వెంకటేష్, ప్రవీణ్, రవి, లక్ష్మణ్, రమ్య, శ్రీహరి, కుమార్ తదితరులు పాల్గొన్నారు
