Station Ghanpur Councillor Arrest
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
వృద్ధురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు మేరకు స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ సౌదరపల్లి సంపత్ రాజ్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్టు స్టేషన్ ఘన్ పూర్ సీఐ వేణు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి చాగల్లులో సోమవారం రాత్రి 9వ వార్డు సభ్యుడు సంపత్ రాజ్ ఒక ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్న వృద్ధురాలు పక్కలో పడుకొని ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంపత్ రాజును అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టినట్లు సీఐ తెలిపారు.
