CP SWETHA STATION GHANPUR
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ను వరంగల్ సీపీ శ్వేత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారాలకు సంబంధించిన రికార్డులు, సిబ్బంది వివరాలు, స్టేషన్ రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా మసలుకొని సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తనిఖీ సందర్భంగా ఆమె వెంట డిసిపి రాజమహేంద్ర నాయక్, సిఐ వేణు, ఎస్సై మనిషా సిబ్బంది ఉన్నారు.
