Kamalapur YSR Jayanti
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కమలాపూర్ బస్టాండ్ కూడలి వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైయస్ రైతు రుణమాఫీ, పావలా వడ్డీ రుణాలు,108 అత్యవసర సదుపాయాన్ని కల్పించారని కొనియాడారు.
* చాకలి ఐలమ్మ విగ్రహా నిర్మాణానికి భూమి పూజ
మండల రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలందరూ అన్యాయాన్ని ఎదిరించాలని అన్నారు. కోటి ఉమెన్స్ కాలేజీ పేరును సీఎం. రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ పేరిట మార్పు చేశారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసాని రమేష్ గౌడ్, డాక్టర్ మౌటం కుమారస్వామి, సర్పంచ్లు వాసాల శ్రీనివాస్, ఉపసర్పంచ్ పుల్ల శ్రీనివాస్, తడక శ్రీకాంత్, పోడేటి బిక్షపతి, మార్కెట్ డైరెక్టర్ జనగాని శివకృష్ణ, కిన్నెర కృష్ణమూర్తి, నాంపల్లి ప్రభాకర్, కెత్త రవి, కొండపాక మనీష్, పెరుమాండ్ల పరుశురాములు, ఆకునూరి సాంబయ్య, జన్ను వేణు, బాలపురి కనక రత్నం, వైనాల సాంబయ్య, గాలిబ్, నవీన్, చేరాల రోహిత్, ఆడెపు శ్రీకాంత్, జన్ను బిక్షపతి, మాట్ల కళ్యాణ్, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
