mla Kadiyam Srihari Birthday Celebrations
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి 75 వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జన్మదిన వేడుకల్లో ఎంపీ కడియం కావ్య, ఏడు మండల పార్టీల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ తాడికొండ వినయ్, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూన్ కుంట్ల లావణ్య రెడ్డి తోపాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
* “పల్లగుట్టలో”
చిల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు అధ్యక్షతన చిల్పూర్ దేవస్థానం చైర్మన్ కొత్తపల్లి శ్రీధర్ రావు మండల నాయకులు హనుమకొండలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద కడియం శ్రీహరికి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పల్లగుట్టలోని శ్రీధర్ రావు స్వగృహంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు, సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆయా గ్రామాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
