Modi Wishes Bandi Sanjay
* బండి సంజయ్కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కు జన్మదిన సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వంలో తన సహచరుడిగా ఉన్న బండి సంజయ్, సరిహద్దులు లేని శక్తితో, అలసట లేని కృషితో, దృఢ సంకల్పంతో నవ భారత నిర్మాణానికి నిరంతరం శ్రమిస్తున్నారని ప్రధాని కొనియాడారు. దేశ ప్రగతి, శ్రేయస్సు కోసం ఆయన చూపిస్తున్న అంకితభావం, నిబద్ధత ముఖ్యంగా నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రధాని అభినందించారు. ఈ పుట్టినరోజు బండి సంజయ్ జీవితంలో మరింత సంతోషాన్ని, శాంతిని, ఐశ్వర్యాన్ని నింపాలని కోరుకుంటూ పీఎం మోదీ తన లేఖలో ఆశీస్సులు అందజేశారు
ప్రధాని మోదీ పంపిన ఈ లేఖను బండి సంజయ్ తన సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు తనకు జీవితాంతం స్ఫూర్తినిస్తాయని, దేశ సేవలో మరింత బాధ్యతగా ముందుకెళ్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు
మరోవైపు బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హార్ష సంఘవి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ తదితరులు బండి సంజయ్కు శుభాకాంక్షలు తెలిపారు.
