Bandi Sanjay Birthday Celebrations
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మండల బీజేపీ అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు స్థానిక కమలాపూర్ బస్టాండ్ కూడలి వద్ద కేక్ కట్ చేసి బండి సంజయ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సామాజిక బాధ్యతగా కమలాపూర్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులను బీజేపీ నాయకులు పరామర్శించారు. వారికి పండ్లను పంపిణీ చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
