Telangana Airport Development Projects
* తెలంగాణ ఎయిర్‌పోర్టులపై రేవంత్ ఫోకస్
ఆకేరు న్యూస్, డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. ఈ ఎయిర్‌పోర్టుల డిజైన్లు, వసతుల కల్పన, భూసేకరణ మరియు కేంద్ర అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. ఈ భేటీతో ఉత్తర తెలంగాణ జిల్లాల వైమానిక కనెక్టివిటీకి లైన్ క్లియర్ కానుంది.
