Bugulu Venkateswara Temple Puja
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామికి *అష్టదళ పాద పద్మారాధన పూజ* బంగారు పద్మాలతో అంగరంగ వైభవంగా జరిగింది. దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు-కిరణ్మయి దంపతులు రూ. 516లు చెల్లించి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల భక్తులు అష్టదళ పాదపద్మారాధనలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించినారు. కార్యనిర్వాహణాధికారి లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు రవీందర్ శర్మ , సౌమిత్రి రంగాచార్యులు, కృష్ణమాచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
