Prabhas Fauzi Release Date Poster
* పవర్ఫుల్ పోస్టర్‌తో అంచనాలు రెట్టింపు!
* డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల
* హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా
ఆకేరు న్యూస్, డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ (Prabhas fauzi) విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 3, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* యాక్షన్ లుక్‌తో ఆకట్టుకున్న ప్రభాస్
తాజా పోస్టర్లో ప్రభాస్ యుద్ధభూమి నేపథ్యంలో శక్తివంతమైన యోధుడి అవతారంలో కనిపించారు. ఆయన ఇంటెన్స్ లుక్, మేకోవర్, పోస్టర్ డిజైన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. “అజ్ఞాతపర్వం ముగిసింది.. తిరుగుబాటు మొదలవుతోంది” అనే ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
* స్వాతంత్ర్యానికి ముందు కథ..
‘ఫౌజీ’ (Prabhas fauzi) చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ వార్ డ్రామా. భావోద్వేగాలు, దేశభక్తి, యాక్షన్ అంశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్నారు.
* భారీ తారాగణం.. టాప్ టెక్నికల్ టీమ్
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్ ఎస్మాయిల్ కథానాయికగా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
* అభిమానుల్లో భారీ అంచనాలు
రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేయడంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే సోషల్ మీడియాలో #Fauji, #Prabhas హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండగా, డిసెంబర్ 3 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
