kekan sudhir ramnath Mulugu Police Sports Medals
ఆకేరు న్యూస్, ములుగు:
5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 (క్లస్టర్–A) పోటీల్లో ములుగు జిల్లా పోలీసులు నాలుగు పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సుధీర్ రామ్ నాథ్ కేకన్ తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే పోలీసు సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జట్టు సమన్వయం, పరస్పర సహకారం, నిరంతర సాధన, లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమన్వయం, జట్టు స్ఫూర్తి, శారీరక దృఢత్వం అత్యంత కీలకమని, ఈ లక్షణాలను పెంపొందించడంలో క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు.
నేరాల దర్యాప్తు నుంచి శాంతిభద్రతల పరిరక్షణ వరకు ప్రతి బాధ్యతను విజయవంతంగా నిర్వహించడంలో జట్టు సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది క్రీడాస్ఫూర్తితో విధులు నిర్వహిస్తూ పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకుంటే మరిన్ని విజయాలు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్రీడలకు సమయం కేటాయించే పోలీసు సిబ్బందికి శాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో విజయాలు సాధించి శాఖకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో విజయం క్రమశిక్షణ, సమన్వయం, నిరంతర సాధన ఫలితమని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందిస్తాయని, విధి నిర్వహణలో క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
పథకాలు సాధించిన వారిలో ఆర్ఎస్ఐ డి. రాకేష్ – రెజ్లింగ్లో (కాంస్య పతకం),
ఆర్ఎస్ఐ ఎన్. అశోక్ – రెజ్లింగ్లో (కాంస్య పతకం).
హెడ్ కానిస్టేబుల్ (HC-721) అమిత్ కుమార్ సింగ్ – రెజ్లింగ్లో రజత పతకం, జూడోలో కాంస్య పతకం సాధించారు వీరిని ఎస్పీ అభినందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
