Hanamkonda Rain Farmers Relief
* నగరంలో ఆహ్లాదం
ఆకేరు న్యూస్, హనుమకొండ: గత కొన్ని రోజులుగా ప్రజలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. సోమవారం మద్యాహ్నం ఒక్కసారిగా హనుమకొండలో వర్షం కురిసింది. దీంతో నగరం ఎంతో ఆహ్లాదకరంగా మారింది. వర్షాలు లేక పోవడంతో వేసవి కాలాన్ని తలపిస్తూ ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక రైతులు వర్షాలు కురవక పోవడంతో ఆకాశం కేసీ ఆశగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే వ్యవసాయ పనులు జోరుగా సాగాల్సింది పోయి.. పనుల్లో స్తబ్థత ఏర్పడింది.. ఇదే విదంగా వానలు కొనసాగితే ఎంత బాగుండేదని ప్రజలు, రైతులు కొరుకుంటున్నారు.. మరి వరుణుడు కరుణిస్తాడో లేదో వేచి చూద్దాం..
—————
