Priyanka gandhi backed CJPs demand on NEET Paper Leak protest
Published:
* ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వ్యాఖ్య
ఆకేరు న్యూస్, డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ సమంజసమేనని వ్యాఖ్యానించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు బలప్రయోగం చేయడం తీవ్ర విచారకరమన్నారు. ప్రధాని మోదీ స్పందించి యువత సమస్యలను ఆలకించాలని, నీట్ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రియాంక కోరారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
