PM NARENDRA MODI ON NEET PAPER LEAK ACTION
* లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తాం- ప్రధాని మోదీ
ఆకేరు న్యూస్, డెస్క్: ఇటీవలి నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై ఎన్డీఏ (NDA) పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో స్పందించారు. భవిష్యత్తులో ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత దేశంపై ఉందని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడటమే సరైన పరిష్కారమని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, యువతను రెచ్చగొట్టకుండా వారికి సరైన గైడెన్స్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా రీ-ఎగ్జామ్ కూడా నిర్వహించామని, పరీక్షా విధానాన్ని మరింత పటిష్టం చేస్తామని ప్రధాని భరోసా ఇచ్చారు.
