Telangana High Court JUSTICE B VIJAYSEN REDDY at Bhadrakali temple
* శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
ఆకేరు న్యూస్, వరంగల్:
ఓరుగల్లు నగరంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, శ్రీ భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న గౌరవ న్యాయమూర్తికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్టును దర్శించుకుని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం చేయగా, ఆలయ నిర్వాహకులు అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాన్ని బహుకరించి సత్కరించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక ప్రముఖులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
