Warangal Police Vehicle Rapido
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వానికి చెందిన పోలీస్ వాహనాన్ని ప్రైవేట్ రాపిడో (Rapido) సేవలకు వినియోగిస్తున్న ఉదంతం కలకలం రేపింది. ప్రభుత్వ అవసరాల నిమిత్తం కేటాయించిన వాహనాన్ని వ్యాపార వేదికపై వాడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఓ ప్రయాణికుడు వరంగల్‌లోని అంబేద్కర్ సెంటర్ నుంచి సుబేదారి వరకు వెళ్లేందుకు రాపిడో యాప్ ద్వారా బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు. అయితే, అక్కడికి వచ్చిన రైడర్ పోలీస్ శాఖకు చెందిన అధికారిక బైక్‌పై రావడం చూసి సదరు కస్టమర్ ఆశ్చర్యపోయాడు.
దీనిపై ప్రయాణికుడు రైడర్‌ను ప్రశ్నించగా, “ఈ బైక్ మా ఫ్రెండ్ కానిస్టేబుల్‌ది” అని సదరు డ్రైవర్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రభుత్వ విధుల కోసం ఉపయోగించాల్సిన పోలీసు వాహనాన్ని ఇలా ప్రైవేట్ ప్రయాణ సేవలకు వినియోగించడంపై స్థానికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
