Udhayanidhi Stalin Arrested Over Controversial Remarks
* తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సీఎం విజయ్, ప్రముఖ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో తమిళనాడు వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
* క్షమాపణ చెప్పాలని డిమాండ్..
ఇటీవల ఓ కార్యక్రమంలో విజయ్, త్రిషలను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై టీవీకే శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఉదయనిధి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. ఈ క్రమంలోనే ఆయనపై తంజావూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు నమోదైంది. పోలీసులు ఉదయనిధిపై ఆరు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
* రోడ్డుపై డీఎంకే రచ్చ.. తోపులాట
ఉదయనిధిని పోలీసులు వాహనంలో తరలిస్తుండగా డీఎంకే (DMK) కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అడ్డుకున్నారు. పోలీసు వాహనానికి అడ్డంగా నిలబడి నిరసన తెలపడంతో తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి ఉదయనిధిని తీసుకెళ్లారు. టీవీకే, డీఎంకే శ్రేణుల పోటాపోటీ నిరసనలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
* నా అరెస్ట్ ఒక జోక్- ఉదయనిధి స్టాలిన్..
పోలీసుల అదుపులో ఉన్న ఉదయనిధి ఈ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. “నా అరెస్ట్ ఒక జోక్ లా ఉంది. నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు, ఏ ఒక్కరి పేరును కూడా నేను నేరుగా ప్రస్తావించలేదు. ఈ అంశాన్ని మేము న్యాయపరంగానే ఎదుర్కొంటాం”
అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
అరెస్ట్ ముప్పును ముందే ఊహించిన ఉదయనిధి వర్గం ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి పరిణామాలు ఉండే అవకాశముంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
