Anupama Parameswaran Toxic Relationship
* అనుపమా పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ‘ఆ బంధంలో నన్నే నేను కోల్పోయా’.. రెండేళ్ల నరకం చూశానని అనుపమా పరమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గతంలో ఎదుర్కొన్న మానసిక వేదన గురించి తొలిసారి సూటిగా మాట్లాడారు. ముఖ్యంగా ఒక టాక్సిక్ రిలేషన్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో తనను తానే కోల్పోయినట్లు అనిపించిందన్నారు.
* రెండేళ్లు .. ఆనందం ప్రశాంతత కోల్పోయాను
గత రెండు సంవత్సరాలు తన జీవితంలో ఎంతో బాధాకరమైన కాలంగా గడిచాయని అనుపమా తెలిపారు. ఆ అనుభవం తనపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిందని, ఒక దశలో తన ఆనందం, ప్రశాంతత రెండింటినీ కోల్పోయానని వివరించారు. బయటపడేందుకు తాను ఎంతో కష్టపడ్డానని అనుపమా చెప్పారు.
* జీవితాన్ని మళ్లీ ఆస్వాదిస్తున్నా
ఇప్పుడు గతాన్ని దాటి తనను తాను తిరిగి వెతుక్కుంటున్నానని, జీవితాన్ని మళ్లీ ఆస్వాదించడం ప్రారంభించానని తెలిపారు. ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్న వారు తమ పరిస్థితిని గుర్తించి బయటపడేందుకు తన అనుభవం ఉపయోగపడాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఒక నటుడితో ఆమె రిలేషన్ లో ఉందంటూ గతంలో ప్రచారం జరిగింది. ఇటీవల ఆమె సోషల్ మీడియా పోస్టులు కూడా అభిమానుల్లో బ్రేకప్ ఊహాగానాలకు దారితీశాయి. అయితే అనుపమా తన వ్యాఖ్యల్లో ఎక్కడా ఎవరిపేరునూ ప్రస్తావించలేదు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
