Prakash Raj Voter Issue
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తన ఓటు తొలగింపుపై అధికారులు పొరపాటు జరిగిందని, సరిచేస్తామని చెప్పి.. వివాదం పెద్దదైన తర్వాత మాట మార్చారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. తన వీడియో బయటకు వచ్చిన తర్వాతే తన ఓటు విషయంలో అధికారులు స్పందించారని, మరి సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారంటూ ఇటీవల ఆయన చేసిన ఆరోపణలపై ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు. అయితే అధికారుల వివరణను ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. తన ఓటు హక్కును తిరిగి పొందేందుకు ఫారం-6 ఎందుకు దాఖలు చేయాలని ప్రశ్నించారు.
* ‘ఫారం-6 ఇవ్వను’
తన ఓటు హక్కును పునరుద్ధరించుకోవడానికి కొత్త చిరునామాతో ఫారం-6 సమర్పించాలని అధికారులు సూచించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ అందుకు నిరాకరించారు. తన ఓటును ఎందుకు తొలగించారనే దానిపై ముందుగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు అని, దాన్ని తిరిగి పొందేందుకు తానే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
* అధికారుల వివరణ ఏంటి?
ప్రకాశ్ రాజ్ ఓటును తొలగించలేదని బెంగళూరు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఆయన ఓటు నమోదైన విఠల్ మాల్యా రోడ్డులోని చిరునామాలో దాదాపు నాలుగేళ్లుగా నివసించడం లేదని బూత్ లెవల్ అధికారి విచారణలో తేలిందని తెలిపారు. భవన యజమాని, స్థానికులను కూడా విచారించిన తర్వాత ఆయన పేరును ‘షిఫ్ట్’ కేటగిరీలో గుర్తించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాతో ఫారం-6 ద్వారా ఓటును తిరిగి నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
