The Odyssey IMAX Record
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు ఇతిహాసం ‘ఒడిస్సీ’ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. ఐమ్యాక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ వసూళ్లలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు ‘అవతార్’ పేరిట ఉండగా.. ‘ది ఒడిస్సీ’ దాన్ని అధిగమించింది. ఐమ్యాక్స్‌లో ఈ సినిమా వసూళ్లు ఇప్పటికే 289 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
* ఏడాదికి ముందే బుకింగ్స్
ఐమ్యాక్స్ వెర్షన్ లోనే తెరకెక్కించిన ఈ చిత్రానికి ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్స్ ఓపెన్ చేస్తే హౌస్ ఫుల్స్ . ఇక థియేటర్స్ లో 2026 జూలై 16న విడుదల అయ్యాక ఏకంగా రెండు నెలల వరకు ప్రపంచ దేశాల్లో ఐమ్యాక్స్ టికెట్స్ మిగల్లేదు. ఇదొక రికార్డు గా నిలిచింది.
* మరో రికార్డుపై గురి
‘ది ఒడిస్సీ’.. ఇప్పుడు తన వసూళ్లను మరింత పెంచుకునే దిశగా సాగుతోంది. ఆగస్టు 14న చైనాలో 20 వేల స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. 90 శాతం ఐమ్యాక్స్ స్ర్కీన్స్ ఈ సినిమాకే కేటాయించారు. ఇంకేముంది ఐమాక్స్ వెర్షన్ లో ఇంకొక రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
* నోలన్ కెరీర్లోనే బిగ్గెస్ట్
ఐమ్యాక్స్ రికార్డుతో పాటు ‘ది ఒడిస్సీ’ మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి.. క్రిస్టోఫర్ నోలన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో ‘ది డార్క్ నైట్ రైజెస్’ను వెనక్కి నెట్టింది.
* ఐమ్యాక్స్‌లో చిత్రీకరణ
‘ది ఒడిస్సీ’ ప్రత్యేకత కేవలం వసూళ్లలోనే కాదు. ఈ సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్ ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరించారు. దీంతో ఇలా పూర్తిగా ఐమ్యాక్స్‌లో షూట్ చేసిన తొలి బ్లాక్‌బస్టర్‌గా కూడా ఇది రికార్డు సృష్టించింది. భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులకు అత్యంత విస్తృతమైన ఫార్మాట్లో అందించేందుకు నోలన్ ఈ టెక్నాలజీని ఉపయోగించారు.
* రాజమౌళి ..వారణాసి కూడా ఐమ్యాక్స్ ఫిల్మ్ కెమెరాలే..
స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కలయికలో వస్తున్న వారణాసి కూడా ఐమ్యాక్స్ ఫిల్మ్ కెమెరాలతోనే చిత్రీకరణ చేస్తున్నట్లు జక్కన్న ఇదివరకే తెలిపాడు. ఇక విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు కంటికి ఇంపుగా కనబడతాయట. మరి వారణాసి రిలీజ్ అయితే తర్వాత ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచిచూడాల్సిందే.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
