Niu Lai
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : “ఊహించగలిగిన ప్రతి విషయంలోనూ చెత్తగా ఉంది” అంటూ విమర్శలు ఎదుర్కొన్న ఓ చైనీస్ యానిమేటెడ్ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వంటి భారీ చిత్రాలకు పోటీగా నిలుస్తోంది. సినిమా నిజంగా ఎంత దారుణంగా ఉందో చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుండటం విశేషం.
* ది కౌఈజ్ కమింగ్
‘న్యూ లాయ్’ అంటే ‘ది కౌ ఈజ్ కమింగ్’ అని అర్థం. 86 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేషన్ చిత్రంలో అప్పుడే పుట్టిన ఓ దూడ, ఓ స్కైలార్క్ పక్షి మధ్య ఏర్పడే అనుబంధాన్ని ఒక విభిన్నమైన కలల నేపథ్యంలో చూపించారు.
* తక్కువ మంది టికెట్లు కొన్నారు
ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ సినిమా తొలుత ఎలాంటి ప్రభావం చూపలేదు. మొదటి పది రోజుల్లో కేవలం 7,700 యువాన్లు, అంటే సుమారు రూ.1.04 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దేశవ్యాప్తంగా 300 మందికంటే తక్కువ మంది మాత్రమే ఈ సినిమాకు టికెట్లు కొనుగోలు చేశారు.సినిమాకు ఎలాంటి ప్రమోషనల్ టూర్ నిర్వహించలేదు. విడుదలకు ముందు పెద్దగా ప్రచారం చేయలేదు. చివరకు ట్రైలర్ కూడా విడుదల కాలేదు.అయితే ఆ తర్వాత సినిమాలోని కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలోకి వచ్చాయి.
* ట్రోల్స్ కలిసొచ్చాయి
సినిమాలోని నాసిరకం కంప్యూటర్ గ్రాఫిక్స్, సహజత్వం లేని పాత్రల కదలికలు, ఇబ్బందికరంగా అనిపించే వాయిస్ యాక్టింగ్, అర్థం కాని కథను చూసిన నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొందరు దీన్ని సరిగ్గా రూపొందించని విద్యార్థి ప్రాజెక్ట్‌తో పోల్చారు. మరికొందరు “ఏఐ కంటే కూడా దారుణంగా ఉంది”, “2026లో వచ్చిన అత్యంత చెత్త సినిమా కావచ్చు” అంటూ కామెంట్లు చేశారు.అయితే ఈ విమర్శలు సినిమాను నాశనం చేయలేదు. ఏకంగా ఆ విమర్శలే ‘న్యూ లాయ్’ను వైరల్ చేశాయి. సినిమా నిజంగానే అందరూ చెబుతున్నంత దారుణంగా ఉందా? అనే ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు.
* రూ. 20 కోట్ల వసూళ్లు
చైనీస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ మావోయాన్ ప్రకారం.. ఈ సినిమా ఇప్పటివరకు 14.9 మిలియన్ యువాన్లకు పైగా, అంటే సుమారు రూ.20 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో చైనాలోని బాక్సాఫీస్ ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా భారీ చిత్రాల సరసన నిలిచింది. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ‘న్యూ లాయ్’ను కేవలం ఇద్దరు వ్యక్తులు ఐదేళ్లపాటు పనిచేసి రూపొందించినట్లు సమాచారం. జిన్ యుమెంగ్, సన్ లిఫాంగ్ అనే తల్లీకొడుకులుగా భావిస్తున్న ఈ ఇద్దరే సినిమాకు రచయితలు, దర్శకులు, నిర్మాతలు, వాయిస్ ఆర్టిస్టులుగా కూడా పనిచేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
