MLA Kadiyam Srihari, Sardar Sarvai Papanna 376th Jayanti
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతీ ఒక్కరు అయన అడుగు జాడల్లో నడవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో మంగళవారం సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. బడుగులను ఐక్యం చేసి, ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటను జయించిన సర్దార్ పాపన్నను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దొరలు, పెత్తందార్ల ఆదిపత్యానికి, అణచివేతకు ఎదురొడ్డి పోరాడిన వీరుడు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిత్యం పరితపించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని వెల్లడించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు. గీతా కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ బుచ్చి కొమురయ్య, మాజీ సర్పంచ్ బొడ్డు సమ్మయ్య, నష్కల్ సర్పంచ్ రాజు, గడ్డమీది సురేష్ కుమార్, నీల రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు రవీందర్, రాజు, మమ్మద్ షకీల్, రత్నాకర్ రెడ్డి, గట్టు రవి, హరిబాబు, హసీఫ్, శ్రీను, రమేష్ స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
