* టీచర్లకు రక్షణ కల్పించాలి
– ట్రస్మా డివిజన్ అధ్యక్షులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
నల్గొండ జిల్లా, మల్లెపల్లి నాగార్జున హై స్కూల్ కరస్పాండెంట్ కళ్ళు రూపా రెడ్డి హత్య అమానుషమని ట్రస్మా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ అధ్యక్షులు ఉబ్బని మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు సంజీవ్ కుమార్, డివిజన్ కోశాధికారి జార్జ్ బెన్నీ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని లయోలా హై స్కూల్ లో శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యను కరస్పాండెంట్స్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా డివిజన్ ప్రెసిడెంట్ ఉబ్బని మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు సంజీవరెడ్డి, డివిజన్ ట్రెజరర్ బెన్నీ జార్జ్ లు మాట్లాడుతూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకువచ్చి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తల్లిదండ్రులు పిల్లలను అతిగారాభం చేయడం, పట్టించుకోకపోవడం వలన చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించకుండా సంఘ విద్రశక్తులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను చెడు వ్యసనాలకు లోనై అతి కిరాతకంగా హత్య చేయడం చాలా బాధాకరం అన్నారు. ఈ హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీవ్రమైన కఠినతరమైన చట్టాలను ప్రభుత్వం తీసుకురావాలని, విచ్చలవిడిగా సాగుతున్న మాదకద్రవ్యాల అమ్మకాలు ప్రభుత్వం కట్టడి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కోశాధికారి ఎలబోయిన కొండయ్య, పాలకుర్తి శ్రీధర్, బిట్ల శివతేజ, మండల శంకర్, డొమి జోసెఫ్, పిట్టల రాజు, దేవరాజుల రాము, ఎడ్ల స్పర్జన్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
